ఏంటో, అంతా అయోమయం.
మీడియా వ్యవస్థాపకుడే ముఖ్యమంత్రి. మీడియాలో కీలక పదవులు నిర్వహించినవారే ప్రభుత్వంలో కీలకపదవుల్లో ఉన్నారు.
కానీ, మంత్రుల మీడియా సమావేశాలు మినహా ఇతర అధికారిక మీడియా సమావేశాలు లేవు.
మీడియాని నమ్ముతారో లేదో తెలియదు. జర్నలిస్టులను గుర్తిస్తున్నారో లేదో తెలియదు.
జర్నలిస్టుల అక్రిడేషన్లు గాలిలో… అసలు అక్రిడేషన్లు ఎందుకివ్వాలో, ఎందుకు ఇవ్వకూడదో స్పష్ఠత కనిపించదు. అక్రిడేషన్ల కమిటీలో జర్నలిస్టులు ఎందుకు లేరో తెలియదు.
అక్రిడేషన్ అంటే ‘బస్ పాస్’ కాదు స్వామీ!
ఇప్పుడు మీరిచ్చే అక్రిడేషన్ అనే గుర్తింపు కార్డు కోసం నేను జర్నలిస్టుని అని మీకు నిరూపించి, అందుకు సాక్ష్యాలిచ్చి, దేబిరించాల్సిన అవసరం, అగత్యం లేదు.
జర్నలిస్టుని అనే స్పృహ నాకుఉండి, వార్త రాసే అవకాశం నా పత్రిక కల్పిస్తే, నేను జర్నలిస్టుని అని సమాజం గుర్తిస్తుంది.
హా… గుర్తించకపోయినా పర్లేదు. గుర్తించని అగౌరవం మీకే మిగులుతుంది.
అయినా, ప్రెస్ కౌన్సిల్ అడుగుతోంది. రివర్స్ టెండరింగ్ అని చెప్పండి… ఎన్ని కోట్లు ఆదా చేశారో చెప్పండి.
✍️ గోపి దారా