ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు దుశ్చర్యకు పాల్పడ్డారు. గాలింపు చర్యలకు వెళ్లిన జవాన్లు లక్ష్యంగా మావోయిస్టు పార్టీ నక్సల్స్ మందుపాతర పేల్చడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం భద్రతా బలగాలు నక్సల్స్ కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా, కుట్రు ప్రాంతంలో మాటువేసిన నక్సలైట్లు అదును చూసి మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో తలేంద్ర కుమార్ నాయక్ అనే కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోగా, మరో జవాన్ అమర్ ఠాకూర్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం గాయపడిన జవాన్ ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. సంఘటనను బీజాపూర్ ఎస్పీ కమలోచన్ కశ్యప్ ధృవీకరించారు.