రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ రాసలీలలు సాగిస్తూ దొరికిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఒకరు ఓ యువతితో రాసలీలల్లో నిమగ్నమై ఉండగా కీసర పోలీసులు దాడి చేసి పట్టుకున్నట్లు ఆయా వార్తల సారాంశం. తిమ్మాయిపల్లి గ్రామంలో గల సైలెంట్ వరల్డ్ రిసార్ట్ లో ఎస్ఐ రాసలీసలు సాగిస్తూ పోలీసులకు చిక్కాడని, ఎస్ఐతో పాటు ఆయనతో గల యువతిని అదుపులోకి తీసుకున్న కీసర పోలీసులు ఘటనపై విచారణ నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కీసర పోలీసులు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, ఎటువంటి కేసు నమోదు చేయలేదని కీసర సీఐ ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు.