శ్రీ రాపాక వరప్రసాద్,
గౌరవనీయ శాసన సభ్యుడు గారికి,
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని వివిధ స్థాయిల్లో జరిగిన సమావేశాల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఇదే విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన పూర్తి స్థాయిలో అమరావతి కేంద్రంగానే కొనసాగించాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి చెందాలని సమావేశాల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైంది.
ఇదే దశలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ఏపీ డీ-సెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవలప్ మెంట్ రీజియన్స్ యాక్ట్-2020, అమరావతి మెట్రో డెవలప్ మెంట్ యాక్ట్-2020 బిల్లులను శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టే సమయంలో, ఓటింగ్ సమయంలో వ్యతిరేకించాలని మన పార్టీ నిర్దేశిస్తున్నది.
ఇట్లు
పవన్ కళ్యాణ్, జనసేన
మూడు రాజధానులకు మద్ధతు ఇస్తానని, జగన్ ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేస్తానని జనసేన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రకటించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ లేఖ రాయడం విశేషం. రాజకీయపరంగా పవన్ లేఖను విప్ జారీ చేసినట్లుగానే భావిస్తున్నప్పటికీ, వరప్రసాద్ పవన్ ఆదేశాన్ని శిరసావహిస్తారా? లేక ధిక్కరిస్తారా? అనే అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది.