ఏపీ రాజధాని అమరావతి అంశంలో ఆ రాష్ట్ర ప్రజల అభిప్రాయాలను కాసేపు పక్కన పెట్టండి. ఇదిగో ఈ వాయిస్ వినండి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్వరాన్ని పోలిన ఈ గొంతు నుంచి వెలువడిన వ్యాఖ్యలు ఆయన చేసినవేనా? తుమ్మల గొంతును ఎవరో రికార్డు చేసి సోషల్ మీడియాలో వదిలారా? అమరావతి రాజధాని అంశంలో ఇద్దరి మధ్య సాగిన ఈ సంభాషణను జాగ్రత్తగా వినండి. అక్కడక్కడ తుమ్మల పరిభాష శైలి పదాలు వినిపిస్తున్నాయి కూడా. తుమ్మల నాగేశ్వరరావు గొంతుగా పేర్కొంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఆడియోను పూర్తిగా వినండి… విన్నాక అసలు సంగతేమిటో కూడా ఆడియో దిగువన వినండి.
అది నా గొంతు కాదు: తుమ్మల
ఈ ఆడియో సంభాషణ గురించి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును ts29.in వివరణ కోరగా, అది తన గొంతు కాదని స్పష్టం చేశారు. ‘ మీకు తెలుసుగా..? నేను తిట్టడం మొదలెడితే ఎలా ఉంటుందో..? అని తుమ్మల తనదైన శైలిలో నవ్వడం విశేషం. అదీ సంగతి.