భారతదేశంలో పెళ్లి అనేది కచ్చితంగా బానిసత్వమే. పెళ్లితో ఎదుటి మనిషి మీద అధికారం, శాసించే హక్కు వస్తాయనుకోవడం, ఆ మనిషిని తన కంట్రోల్ లో పెట్టుకోవాలనుకునే నీచ మనస్తత్వంతో సమస్య మొదలవుతుంది. భార్యా భర్తల్లో ఎవరో ఒకరు (కొన్నిసార్లు ఇద్దరూ) బలి కాక తప్పదు. ప్రస్తుతకాలంలో ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఆడవాళ్ళ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తోంది. భార్యకు అణిగిమణిగి ఉంటూ గంగిరెద్దుల్లా బతికే భర్తలను చాలా మందిని చూస్తున్నాము. మార్క్సిజం భావాలు ఉన్నవాళ్ళైతే ఆ బానిసత్వానికి తలవంచలేక, ఎదిరించలేక నరకం అనుభవిస్తున్నారు.
నా క్లోజ్ ఫ్రెండ్ ఒకతన్ని వాళ్ళ వైఫ్ ఫుట్ బాల్ మాదిరిగా ఆడుకుంటుంది. ఎంత టార్చర్ అంటే ఊహించలేము. అతన్ని చూస్తే ఒక్కోసారి నాకు ఎంత కోపం వస్తుందంటే “సిగ్గులేకుండా ఇలాంటి బానిస బతుకు బతికేకంటే హుస్సేన్ సాగర్ లో దూకి చావొచ్చు కదా దరిద్రం ఒదిలిపోతుంది ” అంటాను ఒళ్ళుమండి. ఏం చేస్తాం అంతా నా కర్మ నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఇంకెవరు చేసుకుంటారు అంటూ కర్మ సిద్ధాంతాన్ని వల్లిస్తాడు ఆ మార్క్సిస్ట్ మహానుభావుడు. ఏం అర్థం చేసుకోవాలో నాకు అర్థం కాదు. ఇంకో బెస్ట్ ఫ్రెండ్ తను బానిసలా బతుకుతున్నాడన్న విషయం కూడా వాడికి తెలియదు. ఈ ఫ్రెండ్స్ గురించి మరో క్లోజ్ ఫ్రెండ్ కి చెబితే, అతను (కమ్యూనిస్ట్ యూనియన్ లీడర్ ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ) తన ఫ్రెండ్స్ భార్యలు పెట్టే హింస గురించి చెబుతుంటే నాకు మతి పోయింది.
నాకు ఉన్నది ఈ ముగ్గురు ఫ్రెండ్సే. నా ఫ్రెండ్స్ అని కాదుగానీ ఎంత మంచివాళ్ళంటే మగవాళ్లలో ఆణిముత్యాలే. అంత మంచి వాళ్ళను బాధపెట్టడానికి మనసెలా వస్తుందో అర్థం కాదు. అసలు ఆడవాళ్లు ఎందుకు ఇలా ఉన్నారు అనే ప్రశ్న వస్తే దానికి ఎన్నో కారణాలు కనిపిస్తాయి. కానీ చాలా మంది మగవాళ్ళు ఎందుకు చిత్రహింసలు అనుభవిస్తూ మౌనంగా భరిస్తున్నారనే ప్రశ్న నన్ను కొంత కాలంగా చాలా ఎక్కువగా వేధిస్తోంది. భార్య భర్తకు లొంగి ఉండడానికి మళ్లీ అనేక కారణాలు కనిపిస్తాయి. కానీ మగవారు ఆడవారికంటే ఆర్థికంగా, సామాజికంగా, శారీరకంగా బలవంతుడై ఉండి కూడా ఎందుకీ పిరికితనం? ! ఎంత ఆలోచించినా అర్థం కాదు. చచ్చిపోతామని బ్లాక్మెయిల్ చేసే ఆ ఒక్క మాటే వీళ్ళను నోరెత్తకుండా కుక్కల్లా కట్టిపడేస్తుందా? ! ప్రేమ లేకుండా బతకొచ్చు కానీ స్వేచ్ఛ లేని బతుకు ఎంత దుర్భరం !!!
✍️ Vanaja Che