‘‘కరోనా వైరస్‌లో అతి వేగంగా వ్యాపించే కొత్త వేరియంట్’’
‘‘యూకేలో బయటపడిన ఈ మ్యూటేషన్ ఇంకా డేంజర్’’
‘‘మళ్ళీ లాక్డౌన్ దిశగా ప్రపంచ దేశాలు’’
అంటూ కొద్దిరోజులుగా మీడియా సృష్టిస్తున్న ఈ వార్తలు సద్దుమణిగిన భయంకర వాతావరణాన్ని మళ్ళీ తట్టిలేపుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న జనాల్ని మళ్ళీ భయం అనే కోరలతో చుట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది మీడియా.
వేగంగా వ్యాపిస్తే ఏంటి…… !
మ్యూటేషన్ అనేది వైరస్‌లో సర్వసాధారణమైన విషయం. మ్యూటేషన్ అంటే అకస్మాత్తుగా సంభవించే మార్పు అని అర్థం. వైరస్ అనేది DNA లేక RNA తో ఉన్న జెనెటిక్ మెటీరియల్ మాత్రమే. కరోనా RNA వైరస్. ఈ RNA న్యూక్లియోక్యాప్సీడ్ (ప్రోటీన్)తో కవరై ఉంటుంది. దీనిపైన గ్లైకోప్రోటీన్ స్పైక్స్ (ముళ్ళులు) ఉంటాయి. ఈ స్పైక్స్ సహాయంతో RNA (వైరస్) మన శరీరంలోని కణాల్లోకి చొచ్చుకుపోతుంది. వైరస్ అనేది ఎంత చిన్నగా ఉంటుందంటే గుండుసూది గుండు మీద 50 కోట్ల వైరస్లు సునాయాసంగా ఇమిడిపోగలవు. ఇంత చిన్న వైరస్ లో ఏ కొద్దిపాటి మార్పు జరిగినా ఆ వైరస్ మ్యూటేట్ అయ్యిందని అర్థం. ఇది ప్రతీ వైరస్‌లో జరిగేదే. ఇప్పటివరకు కరోనా వైరస్ కూడా అనేక మ్యూటేషన్లకు గురయ్యింది. ఇప్పుడు వచ్చిన ఈ కొత్త మ్యూటేషన్ వైరస్ స్పైక్ ప్రోటీన్ మీద మార్పు తీసుకొచ్చింది. దీన్నే N501Y మ్యూటేషన్ అంటున్నారు.
ఇంగ్లాండ్‌లో గుర్తించిన ఈ మ్యూటేషన్ వల్ల కొత్తగా జరిగే నష్టాలు ఏమైనా ఉన్నాయా? అంటే.., ఉన్నాయనడానికి ఎటువంటి ఆధారాలూ లేవు. ఇది ఇప్పటివరకు వచ్చిన కరోనా మ్యూటేషన్లకంటే భిన్నంగా ఏమైనా ఉందా అంటే వీళ్ళు చెబుతున్నది ఒక్కటే… మునుపటివాటికంటే ఇది ఒకరి నుంచి ఒకరికి ఇంకా వేగంగా అంటుకుంటుంది అని మాత్రమే. ఎందుకంటే స్పైక్ ప్రోటీన్‌లో మార్పు రావడం వల్ల ఇది ఇంకా ఈజీగా మనుషుల కణంలోకి చొచ్చుకుపోయే శక్తిని సంపాదించుకుని ఉంటుందనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. అంతమాత్రాన దీని వల్ల కలిగే నష్టం ఏంటి? ఇప్పటికే వైరస్ సొకిన వారికి మళ్ళీ సోకినా రోగం వచ్చే అవకాశం లేదు. మామూలుగానే కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి చాలా తొందరగా వ్యాప్తి చెందుతుంది. వీరు చెప్పిన ప్రకారం చూసినా ఇది ఇంకొంచెం ఎక్కువ మందికి వ్యాపిస్తుంది. అంతే కానీ రోగ లక్షణాలు అధికమవ్వడం కానీ, ప్రమాదకరంగా మారడం కానీ ఏమీ లేదు. ఈ కొత్త వైరస్ (వేరియంట్) ఇన్ఫెక్షన్ రేటు 0.4% అని ఇంగ్లాండ్ ప్రధాని జాన్సన్ క్లియర్‌గా చెప్పారు.
కొత్త మ్యూటేషన్- నిపుణుల అభిప్రాయం:
వైరస్ శరీరంలో ఎన్ని రకాల మార్పులు చోటుచేసుకున్నా అది మన శరీరంలోని డిఫెన్స్ వ్యవస్థ నుంచి తప్పించుకోలేదు అని న్యూయార్క్‌లోని అల్బర్ట్ ఐన్‌స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ కి చెందిన వైరస్ ఎక్స్పర్ట్ కార్తిక్ చంద్రన్ అంటున్నారు. వైరస్‌లో ఎన్ని మార్పులు వచ్చినా మన ఇమ్యూన్ వ్యవస్థ కచ్చితంగా గుర్తిస్తుంది. ఒకవేళ వైరస్‌లో నిరవధింకంగా మార్పులు చెందుతూనే ఉంటే అలా కనీసం 5-7 సంవత్సరాలు ఏకదాటిగా మ్యూటేషన్లు సంభవిస్తూనే ఉంటే అప్పుడేమైనా నిరోధక వ్యవస్థ వైరస్‌ను గుర్తించలేకపోవడానికి అవకాశం ఉండొచ్చు కానీ ఇప్పడు ఈ మ్యూటేషన్ వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని ఆయన తేల్చి చెప్పారు.
వాషింగ్టన్ లో సియేటల్ నగరంలోని ఫ్రెడ్ హట్చిన్సన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్ కి చెందిన ఎవెల్యూషనరీ బయోలజిస్ట్ డా.జెస్సీ బ్లూమ్ అయితే ఈ మ్యూటేషన్ పట్ల జరుగుతున్న హడావిడికి ఆశ్చర్యపోతూ శరీరంలో స్విచ్ బోర్డ్ ఉందనుకుంటున్నారా స్విచ్ ఆన్ చేయగానే ఇమ్యూనిటీ వచ్చి, ఆఫ్ చేయగానే మాయమైపోవడానికి అని వెటకారం చేస్తున్నారు. శరీరంలో ఉత్పత్తి అయిన T- సెల్స్ వైరస్‌ని ఏళ్ళ తరబడి గుర్తుపెట్టుకుంటాయి. ఇప్పుడు ఈ స్పైక్ ప్రోటీన్‌లో వచ్చిన ఈ మ్యూటేషన్ సింగిల్ మోనోక్లోనల్ యాంటీబాడీ దృష్టి నుంచి తప్పించుకోగలదేమో కానీ, మొత్తం ఇమ్యూన్ వ్యవస్థ నుంచి తప్పించుకుపోలేదు అని బ్లూమ్ చెబుతున్నారు.
కరోనా వైరస్ మ్యూటేషన్ల జీనోమ్ సీక్వెన్స్‌కి సంబంధించిన మొత్తం డేటా సేకరించి ఎపిడెమోలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో
PHE (Public Health England) ఇచ్చిన నివేదికలో ఈ కొత్త వేరియంట్ వల్ల వైరస్ వ్యాప్తి మునుపటికంటే అధికమౌతుందే కానీ ఇది ఇంకా ప్రమాదం అనడానికిగానీ, మరణాల రేటు ముందుకంటే ఎక్కువ ఉంటుందనడానికిగానీ ఎలాంటి ఆధారాలూ లేవని స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ స్పైక్ ప్రోటీన్‌లో ఇప్పటికి 4,000 మ్యూటేషన్లు జరిగాయి. D614G రకం అన్నిటికంటే డామినెంట్ స్ట్రెయిన్. చాలా ఈజీగా వ్యాపిస్తుంది. ఇప్పుడు “N501Y” తో పాటు H69/V70 మ్యూటేషన్, A222V, డెన్మార్క్ మ్యూటేషన్ మొదలైన మ్యూటేషన్లు అన్నీ ఒకే రకమైన లక్షణాలను చూపిస్తున్నాయని, మ్యూటేషన్ న్యూక్లియోటైడ్‌లో మార్పే తప్ప రోగ లక్షణాల్లో మార్పు కాదని బెంగుళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ అండ్ న్యూరోసైన్స్ న్యూరోవైరాలజీ డిపార్ట్మెంట్కి చెందిన ప్రొఫెసర్ వి. రవి చెబుతున్నారు.
వాక్సిన్ అమ్ముకోడానికి కొత్త డ్రామా!
కరోనాలో ఇప్పుడు వచ్చిన ఈ కొత్త మ్యూటేషన్ తరచూ వస్తున్న మ్యూటేషన్లాంటిదే అయినప్పుడు మరి ఎందుకింత హడావిడి చేస్తున్నారు అనేది కొంచెం ఆలోచిస్తే చాలా తేలిగ్గానే అర్థం అయిపోతుంది. వ్యాక్సిన్ అమ్ముకోవాలంటే భయం బతికి ఉండాలి. వ్యాక్సిన్ కంపెనీలకు జనాల్లో భయం పోతుందన్న భయం పట్టుకుంది. సెకండ్ వేవ్ అన్నారు, థర్డ్ వేవ్ అన్నారు ఏవీ అంతగా పని చేసేలా లేవు, ఇక ఇలా లాభం లేదు మొదట్లో ఒణికించినట్టు ఒణికిస్తే తప్ప పప్పులు ఉడికేలా లేవు అనుకున్నట్టున్నారు. అందుకే ఒకపక్క ప్రమాదం ప్రమాదం అని భయపెడుతూనే మరో వైపు ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన, రాబోతున్న వ్యాక్సిన్లు అన్నీ ఈ కొత్త మ్యూటేషన్ మీద కూడా పాజిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయని ఎలాంటి సందేహం లేదని ఆమెరికాకు చెందిన అనేక మంది సైంటిస్ట్‌లు, సెర్జన్ జనరల్ వైస్ అడ్మిరల్ జెరోమ్ ఆడమ్స్, ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) మాజీ కమిషనర్ స్కాట్ గాట్లిబ్ వంటి ప్రముఖులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.
వాక్సిన్ తో ఒరిగేదేంటి?
ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన PFizer- Bio NTec, Moderna వ్యాక్సిన్లు, రాబోతున్న Astrazeneca లాంటి అనేక కంపెనీల వ్యాక్సిన్లు అన్నీ కూడా ఈ స్పైక్ ప్రోటీన్‌ని బేస్ చేసుకుని మాత్రమే వ్యాక్సిన్లు తయారు చేశారు. ఒకవేళ ఇప్పుడు ఈ స్పైక్ ప్రోటీన్‌లో వచ్చిన మ్యూటేష్ మునుపటికంటే ప్రమాదకరంగా మారితే ఈ వ్యాక్సిన్లు ఏవీ పనిచేసే అవకాశమే లేదు. వాళ్ళు మాత్రం ఒక పక్క ఇది ప్రమాదమూ అంటారు… అవి పని చేస్తాయీ అంటారు. అందుకే ఈ కొత్త భయం కావాలి. ఇప్పటికే కరోనా వచ్చిన వారిలో ఈ స్పైక్ ప్రోటీన్ కి విరుద్ధంగా కావలసినన్ని యాంటీబాడీలు ఉంటాయి. కొద్ది రోజులకు అవి పోయినా మళ్ళీ వైరస్ సోకితే T-cells మళ్ళీ ఉత్పత్తి చేస్తాయి. ఇవి కృత్రిమంగా తీసుకునే వ్యాక్సిన్లకంటే పవర్ఫుల్. మరి ఈ వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల అధనంగా ఒరిగేదేంటి? లేనిపోని రోగాలూ రొష్టులూ, రకరకాల సైడ్ ఎఫెక్ట్స్‌తోపాటు మరణాలు కూడా సంభవించే అవకాశాలు తప్ప.
✍️ Vanaja Che