మన ఇంటికి వంద గజాల దూరంలో పుట్టిన “యాదగిరి” మనవాడు కాదు…

మనతో కలిసి రోజూ బడికి వచ్చి, ఒకే బెంచి మీది కలిసి కూర్చున్న “రసూల్” మనవాడు కాదు…

మనతో కలిసి గ్రౌండ్ లో ఆటలాడిన “ఎలీషా” మనవాడు కాదు…

మనతో కలిసి ఒకే రాష్ట్రంలో కలిసి జీవించిన “ఉత్తరాంధ్ర, రాయలసీమ” జిల్లావాళ్ళు మనవాళ్ళు కాదు…

మనదేశంలోనే ఉన్న “పంజాబీ” మనవాడు కాదు…

మన మతం కానీ “కాశ్మీరీ” మనవాడు కాదు …

మన హద్దులు కలిసి ఉన్న “పాకిస్థానీ” మనవాడు కాదు….

ఎప్పుడో 70 ఏళ్లక్రితం బతుకు దెరువుకోసం అమెరికాకు వలసవెళ్లిన తల్లి, ఆ పక్కనే ఉన్న జమైకా దేశం నుండి వలసవచ్చిన తండ్రి…
మన మతం కాదు, మన కులం కాదు, మన భాష కాదు, మన ప్రాంతం కాదు, మన రంగు కాదు…

అంతెందుకు?
ప్రేమించిన వాడికోసం ఉన్నఊరునూ, కన్నతల్లినీ, ప్రాణస్నేహితులనూ, ఏకంగా మాతృదేశాన్నే వదిలి వచ్చేసిన సోనియమ్మ ఇప్పటికీ ఎప్పటికీ పరాయిదే, పరాయిదే అని దేశం యావత్తూ అవమానిస్తూనే ఉంటుంది. అది ఈ దేశం కోడళ్ళకిచ్చే మర్యాద.
హ హ…
కానీ..,

అమెరికా ఉపాధ్యక్షురాలు అవగానే “కమల” మన మనిషి అయ్యింది…

ఎల్లలు లేని ప్రేమ మనది …..

మన రోగానికి “మందు” లేదు

✍️ జాన్సన్ జాకబ్

Comments are closed.

Exit mobile version