తెలంగాణా అసెంబ్లీలో బీజేపీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రాణానికి సంఘ వ్యతిరేక శక్తుల నుంచి ఏదేని ముప్పు పొంచి ఉందా? ఈ సందేహాలకు బలం చేకూరుస్తూ ప్రభుత్వం ఆయనకు భద్రతను పెంచడం గమనార్హం. అయితే తనకు ఎవరి నుంచి ప్రాణహాని ఉందో చెప్పాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంలో తాను కేంద్ర, రాష్ట్ర హోం మంత్రులకు లేఖ రాస్తానని కూడా ఆయన ప్రకటించారు.
మరోవైపు ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ కు తెలంగాణా ప్రభుత్వం భద్రతను పెంచింది. ఆయన ఇంటి వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. డీసీపీ స్థాయి పోలీసు అధికారి ఆధ్వర్యంలో రాజాసింగ్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. రాజాసింగ్ టూ వీలర్ పై తిరగవద్దని, ప్రభుత్వ బుల్లెట్ ప్రూఫ్ కారులో మాత్రమే ప్రయాణించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ సూచించారు. అకస్మాత్తుగా రాజాసింగ్ కు భద్రత పెంచడం చర్చనీయాంశంగా మారింది.