కరోనా కల్లోల పరిణామాల్లో బహుషా ఇది తొలి ఘటన కావచ్చు. ఆర్టీసీ చార్జీలు, పెట్రోలు, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై ధర్నాలు జరగడం చూశాం. తమ సమస్యల పరిష్కారం కోసం వివిధ వర్గాలు ప్రజలు రోడ్డెక్కి రాస్తారోకో చేస్తూ ఆందోళనకు దిగిన ఉదంతాలు అనేకం. కానీ తమ గ్రామంలోని కరోనా పేషెంట్లను వెంటనే ఆసుపత్రికి తరలించాలని డిమాండ్ చేసిన ఘటన తెలంగాణాలో ఇప్పటి వరకు ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సొంత ఇలాఖాలోనే ఈ తరహా ధర్నాకు ప్రజలు దిగడం గమనార్హం. ఎమ్మెల్యేగా ఈటెల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం వల్బాపూర్ గ్రామస్తులు శనివారం ధర్నాకు దిగారు. తమ గ్రామంలో కరోనా సోకిన పేషెంట్లను వెంటనే ఐసొలేషన్ వార్డుకు తరలించాలని డిమాండ్ చేశారు. మంత్రి ఈటెల రాజేందర్ పట్టించుకోవడం లేదని కూడా ఆరోపణలు చేశారు. నమ్మశక్యంగా లేదా? అయితే దిగువన గల వీడియో కూడా చూడండి.