ఈ ఫొటోలో మీరు చూస్తున్న పక్షి అరుదైన రాబందు. ఛత్తీస్ గఢ్ లోని గిడామ్ అటవీ ప్రాంతంలో తీవ్రంగా గాయపడిన పరిస్థితుల్లో కనుగొన్న పక్షి. ప్రథమ చికిత్స జరిపిన తర్వాత దీన్ని బిలాస్ పూర్ లోని కనన్ పెండారి జంతు ప్రదర్శనశాలకు తరలించారు. కాలికి తీవ్ర గాయంతో కనిపించిన ఈ రాబందును కనన్ పెండారి జూ సిబ్బంది పర్యవేక్షణలో సురక్షితంగా ఉందనే అందరూ భావించారు. కానీ దాదాపు 20 రోజుల చికిత్స అనంతరం ఈ అరుదైన రాబందు మరణించిందనే వార్తలు వస్తున్నాయి. కానీ అధికార వర్గాలు మాత్రం ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదని ‘బస్తర్ కీ ఆవాజ్’ వార్తా సంస్థ నివేదించింది.