కరోనా వైరస్ కట్టడికి ఇండియన్ రైల్వే శాఖ కూడా సంసిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే రైలు బోగీలను ఐసొలేషన్ కేంద్రాలుగా మార్చాలనే ప్రతిపాదనకు అనుగుణంగా రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశ వ్యాప్తంగా 13 వేలకు పైగా ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఖాళీగానే ఉన్న రైలు బోగీలను కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ఐసొలేషన్ వార్డులుగా మార్చాలనే తలంపునకు అనుగుణంగా స్పందించింది. ఈమేరకు ఐసొలేషన్ వార్డులుగా మార్చిన రైలు బోగీల ఫొటోలను రైల్వే శాఖ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. వైద్య సదుపాయాలు కరువైన ప్రాంతాల్లోనూ ఎమర్జెన్సీ సర్వీస్ కోసం వీటిని ఉపయోగించే అవకాశం ఉందంటున్నారు.

Comments are closed.

Exit mobile version