తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయి పడ్డాయి.ఈనెల 7వ తేదీన ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు 28వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అత్యంత వేగంగా పలు బిల్లులు ఆమోదం పొందడం, ఇతర పరిణామాల నేపథ్యంలో రెండ్రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ముగించనున్నట్లు ts29 ఈనెల 14వ తేదీన వార్తా కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.
బీఏసీ కమిటీ సూచనలు, అన్ని పార్టీల వినతి మేరకు సభను నిరవధికంగా వాయిదా వేసినట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ వర్షాకాల సమావేశాల్లో మొత్తం 12 బిల్లులు ఆమోదించినట్లు ఆయన వివరించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఇద్దరు ఎమ్మెల్యేలకు, 13 మంది పోలీసు, శాసనసభ సిబ్బందికి కరోనా సోకింది. ఈ పరిస్థితుల్లో సభను నిరవధికంగా వాయిదా వేయాల్సి వచ్చిందని స్పీకర్ పేర్కొన్నారు.