తెలంగాణాలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గత రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ప్రి లాంచ్ పేరుతో ప్రజల నుంచి రూ. వందలాది కోట్లను వసూళ్లు చేశారనే అభియోగాలపై సాహితీ ఇన్ ఫ్రా డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ భూదాటి లక్ష్మినారాయణను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసులో ఇతన్ని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రి లాంచ్ పేరుతో సాహితీ ఇన్ ఫ్రా డెవలపర్స్ ఎం.డీ. లక్ష్మీనారాయణ ప్రజల నుంచి రూ. 1,800 కోట్లు వసూల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా మనీ లాండరింగ్ యాక్టు కింద లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా ఈ కేసులో ఈడీ ఇప్పటికే రూ. 161 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.