హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారైన గెల్లు శ్రీనివాస యాదవ్ కు ఉద్యమ నేపథ్యం ఉంది. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడు, పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను తమ అభ్యర్థిగా ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
గెల్లు శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచే పార్టీలో అంకితభావంతో పనిచేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్ఎస్వీ విభాగం అధ్యక్షుడుగా పనిచేసిన గెల్లుశ్రీనివాస్ యాదవ్ ఉద్యమ కాలంలో పలుసార్లు అరెస్టయి జైలుకు కూడా వెళ్లారు. ఆయన పూర్తి నేపథ్యాన్ని ఓసారి పరిశీలిస్తే…
పేరు: గెల్లు శ్రీనివాస యదావ్
తండ్రి పేరు: గెల్లు మల్లయ్య (మాజీ ఎంపీటీసీ, కొండపాక)
తల్లి పేరు: లక్ష్మి (మాజీ సర్పంచ్, హిమ్మత్ నగర్)
పుట్టినతేది: 21-08-1983
విద్యార్హతలు: ఎంఏ, ఎల్ ఎల్ బి
పరిశోధక విద్యార్థి (రాజనీతి శాస్త్రం)
సామాజిక వర్గం: బీసీ (యాదవ్)
నివాస స్థలం: హిమ్మత్ నగర్ గ్రామం,
వీణవంక మండలం
కరీంనగర్ జిల్లా
కార్యనిర్వాహక సంస్థ: రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ
రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం