ఆ చెరువు కింద ఆయకట్టు లేదు కాబట్టి తమకు సంబంధం లేదని చెప్పింది నీటిపారుదల శాఖ. మున్సిపల్ పరిధిలో ఉన్నందున తాము బాధ్యత వహించబోమని పంచాయత్ రాజ్ శాఖ అధికారులు చేతులెత్తేశారు. ఇది తాగునీటి వనరు కాదని, తమ నియంత్రణలోకి రాదని మెట్రో వాటర్ బోర్డు స్పష్టం చేసింది. తాము పెద్ద చెరువులను నిర్వహించమని, తమది బాధ్యత కాదని మున్సిపల్ కార్పొరేషన్ తేల్చి చెప్పింది. అబ్బే… ఏదో వినోదం కోసం మేం బోట్లు నడుపుకుంటున్నామే తప్ప, ఆ చెరువుతో మాకెటువంటి బాధ్యత లేదని పర్యాటక శాఖ కూడా పటాపంచలు చేసింది.
ఇంతకీ ఆ భారీ చెరువు బాధ్యత ఎవరిది మరి? రాజధాని నగరంలో, సెక్రటేరియట్ ఎదురుగా గల హుస్సేన్ సాగర్ గురించి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి చెప్పిన ఆసక్తికర కథనమిది. 400 ఏళ్ల చారిత్రక నేపథ్యం గల హుస్సేన్ సాగర్ విషయంలో 2000 సంవత్సరం ఆగస్టు 23న అప్పటి ముఖ్యమంత్రి సాక్షిగా చోటుచేసుకున్న పరిణామాలను ఆయన తన ఫేస్ బుక్ వాల్ పై కళ్లకు కట్టినట్లు వివరించారు. తెలంగాణా రాజధాని హైదరాబాద్ మహానగరం ప్రస్తుతం వరదలతో విలవిలలాడుతున్న నేపథ్యంలో ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి రాసిన ఈ కథనం ఆద్యంతం ఆసక్తికరమే. అధికారగణం బాధ్యతారాహిత్యాన్ని వివరించే అంశాలను ఆయన నిశితంగా సృశించారు. ఇక చదవండి.
Hussain Sagar. (ORPHAN)
on 23rd August 2000.There were heavy rains as it happened this week. All tanks in and around Hyderabad were full some are overflowing.osmansagar(gandipeta) and Himayat sagar crust gates were opened in the night .All along the Musi river people were alerted through out the night and no lose was reported either to the people or properties.
Scene was totally different with Hussain Sagar.It Was full and out lets were not sufficient to let water go.Back waters entered Ministers’s and officers querters in Begampet.All first floors are flooded and occupents were forced to upper floors.same is the case down stream.Discarge Nala is shrunk and water overflowing entered Ashok Nagar ,Chikkadpalli and other areas.All ground floors are full of water.
CM called for a meeting of all departments concerned with water.To fix responsibility.Beleive me no dapatment owns it.
irrigation department says no Ayucut (crops) under this tank so it is not under us
Panchayat Engineers said it iis in Municipal limits and we are not responsible
Metro water board says it is not drinking water source and doesn’t come to our control
Municipal corporation says it doesn’t handle big tanks
Tourism department says we are running Boats for tourists recreation.nothing to do with Tank maintanence
A big water body 400 years old right in the middle of the Capital city overlooking, Secretariat (seat of power) is’ Orphan’
Now may be …
(I was executive director metro water Board then)