రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందిస్తున్న సేవలకు ఖమ్మం నగరంలోని పలువురు ప్రముఖులు ఫిదా అయ్యారు. ఖమ్మం ప్రజల తరపున మంత్రికి పాదాభివందనం చేస్తూ, ఆయన చేస్తున్న సేవలకు కృతజ్ఞతగా భారీ సత్కార కార్యక్రమాలను నిర్వహించాలని ప్రముఖులు నిర్ణయించారు. వివిధ వ్యాపార, వర్తక వర్గాలకు చెందిన 125 మంది ముఖ్యులతో మంత్రి పువ్వాడను సత్కరించేందుకు ఆహ్వాన కమిటీని కూడా ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని ఉగాది రోజున నిర్వహించాలని తొలుత నిర్ణయించినప్పటికీ, మంత్రి అజయ్ పుట్టిన రోజున అంటే ఏప్రిల్ 19వ తేదీకి సత్కార కార్యక్రమాన్ని మార్చారు. నగరంలోని ముఖ్యప్రాంతాల్లో వీధి, వీధినా ఊరేగిస్తూ మంత్రిని సత్కరించేందుకు కార్యక్రమాన్ని రూపొందించారు. సుడా చైర్మెన్ బచ్చు విజయ్ కుమార్ గౌరవ అధ్యక్షునిగా అనేక మంది ఇతర ముఖ్యులతో ఏర్పడిన ఈ కమిటీ నిర్వహించే కార్యక్రమాలతో కూడిన ప్రకటనను దిగువన ఉన్నది ఉన్నట్లుగా చదవవచ్చు.
ఖమ్మం పౌర సమితి;11.04.2021
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
జిల్లా అభివృద్ధి ప్రధాత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి మా కృతజ్ఞతలు..
ఖమ్మం అభివృద్ధి ప్రదాత, అలుపెరుగని అభివృద్ధి కామకుడు ఖమ్మం ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి ఖమ్మం ప్రజల తరపున ఖమ్మం పౌర సమితి పాదాభివందనం.. ఖమ్మం పౌర సమితి మరియు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఖమ్మం నగరంలోని వివిధ వర్గాలకు చెందిన 125 మంది పురప్రముఖులతో ఆహ్వాన కమిటి ఏర్పాటు చేయడమైంది.
ఖమ్మం నగరాన్ని మెట్రో నగరాలకు ధీటుగా అంచెలంచెలుగా ఉన్నత శిఖరనికి తీసుకొస్తున్న మా పువ్వాడ అజయ్ కుమార్ గారికి మా హృదయపూర్వక వందనాలు.
నేడు ఖమ్మం సకల జనుల సంతోషంగా ఉన్నారంటే అది మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ముందు చూపు వల్లే.. ఎక్కడో ఉన్న ఖమ్మంను నేడు అగ్రభాగాన నిలిపారు. 20 కోట్లు కూడా రాని ఖమ్మంకు దాదాపు 2వేల కోట్ల నిధులు తీసుకొచ్చి, జిల్లా యువతకు ఐటీ హబ్ ద్వారా ఉపాధి, గురుకులాల ద్వారా పిల్లలకు ఉన్నత నాణ్యమైన విద్య, ఆసుపత్రుల ద్వారా వైద్యం ను అందిస్తున్నారు.
నగరంలో మురికి కూపంలా ఉన్న గోళ్లపాడు ఛానల్ అడునికరణ, దంసలాపురం ROB, పేదలకు డబుల్ బెదరూమ్ ఇల్లు, ఆఖరి మాజిలిలో సంతృప్తి కోసం బల్లెపల్లి, కాల్వఒడ్డు వైకుంఠధామంలు, నూతన బస్ స్టాండ్, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు, ఇరుకైన రహదారులను విస్తరించి అన్ని రహదారులు 4లైన్ చేసి సెంట్రల్ లైటింగ్, డివైడర్ ఏర్పాటు, ప్రజలకు అందుబాటులో వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ లు, అన్ని డివిజన్లలో పబ్లిక్ టాయిలెట్స్, NSP కెనాల్ అడునికరించి వాక్ వే లు, ఓపెన్ జిమ్ లు, పార్కులు, వెలుగుమాట్ల అర్బన్ పార్క్ తదితర అభివృద్ధి ఫలాలు ఖమ్మం ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
కులాలు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాలు నేడు కలిసికట్టుగా వారిని అభినందిస్తున్నాం. ఉద్యోగులు, విద్యావంతులు, మేధావులు, కార్మికులు, కర్షకులు, వైద్యులు, న్యాయవాదులు, కళాకారులు, వ్యాపార, వాణిజ్య వర్గాలు మీకు అండగా ఉన్నాయి. ఖమ్మం పౌర సమితి మరియు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కమిటీ వేయడమైంది
మీరు చేస్తున్న అభివృద్ధికి ఉడతా భక్తిగా హంగులు ఆర్భాటాలు మంత్రి గారికి ఇష్టం లేకపోయినప్పటికీ, వారికి ప్రేమతో మా వంతుగా వారిని ఒప్పించి, మెప్పించి వచ్చే ఉగాదికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి పౌర సమితి నేతృత్వంలో సబ్బండవర్ణల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించ తలచాము. అయితే మంత్రి గారి పుట్టిన రోజు ఏప్రిల్ 19వ తేదీన కావడంతో అదే రోజు మా ఈ ముచ్చటను తీర్చుకోవాలని సంకల్పించాము. వారు ఇలాంటి ఆర్భాటాలకు బహు దూరం. అయినా వారికి ఒప్పిస్తామని మాకు నమ్మకం ఉంది. మా ఈ చిరు ప్రయత్నం మంత్రి గారు మన్నించాలని విజ్ఞప్తి చేస్తూన్నాం..
ఈ క్రింది కార్యక్రమాలు వరుస క్రమంలో..
?ఉదయం 6 గంటల నుండి 12 గంటల మధ్య జరుపబడే కార్యక్రమాలు.?
ఈ నెల 19వ తారీకు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నగరంలో పలు చాలివేంద్రాల ప్రారంభోత్సవం.
? ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడును.
? ఇదే రోజున మంత్రి గారి నివాసంలో వేదికను ఏర్పాటు చేసి అలంకరించుట. ఆహ్వాన సంఘ సభ్యుల సమక్షంలో కేక్ కటింగ్, సర్వమత ప్రార్థనలు, సన్మానాలు సన్మాన పత్రం సమర్పించడం.
? తదుపరి విజయ శ్రీ బ్లడ్ బ్యాంక్ మరియు రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధి గ్రస్తుల కొరకు మెగా రక్తదాన శిబిరం నిర్వహించబడును.
మధ్యాహ్నము శ్రీ గుంటి మల్లేశ్వర స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును.
? ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మందులు పంపిణీ చేయబడును.
? ముస్తఫా నగర్ లోని దుర్గ భవాని వృద్ధాశ్రమంలో వృద్ధులకు వస్త్రదానం చేయబడును.
? NSP క్యాంప్ లోని గోశాలకు పశుగ్రాసాన్ని అందించబడును.
?పర్యావరణ పరిరక్షణలో భాగంగా 200 మంది విద్యార్థులకు జ్యూట్ బ్యాగులు అందించబడును.
? గ్రీన్ చాలెంజ్ లో
భాగంగా ఆహ్వాన సంఘంచే 53 వేప మరియు రావి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించబడును.
?సాయంత్రం 4 గంటల నుంచి నిర్వహించబడే కార్యక్రమాలు?
మంత్రి గారి నివాసం నుండి కార్లు మరియు మోటార్ సైకిల్లతో ఊరేగింపుగా గౌరవనీయులైన మంత్రివర్యులు అజయ్ కుమార్ గారిని నయాబజార్ స్కూల్ వరకు తోడ్కొని వచ్చట.
? నయాబజార్ స్కూల్ నుండి పొట్టి శ్రీరాములు రోడ్డు, గాంధీ చౌక్, వర్తకసంఘం, చర్చి కాంపౌండ్, జివి మాల్, మున్సిపల్ ఆఫీస్ రోడ్, మయూరి సెంటర్ నుండి భక్తరామదాసు కళాక్షేత్రం వరకు ఊరేగింపు నిర్వహించబడును.
? ఊరేగింపులో భాగంగా గుంటు మల్లేశ్వర స్వామి దేవాలయం వద్ద జరిగే కార్యక్రమంలో మంత్రివర్యులు పాల్గొంటారు.
? ఊరేగింపులో రెండవ కార్యక్రమం గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహం వద్ద నిర్వహించబడును.
? ఊరేగింపులో మూడో కార్యక్రమం వర్తక సంఘ భవనం వద్ద నిర్వహించడం.
? ఊరేగింపు లో నాలుగవ కార్యక్రమం G V మాల్ వద్ద నిర్వహించబడును.
ఊరేగింపులో నిర్వహించబడే కార్యక్రమాలు..
అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి రెండు డిజిటల్ వ్యాన్లు వినియోగించుట.
వివిధ రకాల కళా జాతాలు, బాణాసంచా.
భక్తరామదాసు కళాక్షేత్రంలో నిర్వహించబడే కార్యక్రమాలు.
డిజిటల్ డిస్ప్లే హాల్లో మరియు కళాక్షేత్ర ఆవరణలో కూడా
గౌరవ మంత్రి గారికి పౌర సన్మానం.
మంత్రి గారి సందేశం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును. ఖమ్మం పౌర సమితి మరియు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొరడమైంది.