చారిత్రాత్మక కొత్త రెవెన్యూ చట్టం బిల్లును తెలంగాణా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దానికి సంబంధించిన ప్రధానాంశాలు ఇవీ :
– కొత్త చట్టం వ్యవసాయ భూమికి మాత్రమే వర్తిస్తుంది.
– వీఆర్వో వ్యవస్థ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం.
వారిని అదేస్థాయిలో ఇతర శాఖలకు బదిలీ
– పాస్ బుక్కులు జారీ చేసే అధికారం తహసీల్దార్లకు.
– రెవెన్యూ రికార్డుల్లో అక్రమాలకు పాల్పడితే డిస్మిస్
– తిరిగి ఆ భూములు స్వాధీనం చేసుకునే అవకాశం
– అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు, శిక్షలు.
– వ్యవసాయ భూముల అమ్మకం, కొనుగోళ్ల రిజిస్ట్రేషన్ అధికారం తహసీల్దార్లకు.
– పూర్తిగా ఆన్ లైన్ విధానంలో లావాదేవీలు,
– భూ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్లు