తెలంగాణా రియల్టర్లకు ఇది శుభవార్త. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర హైకోర్టు అనుమతినిచ్చింది. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో రిజిస్ట్రేషన్లకు అనుమతినిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు ముందుగా స్లాట్ బుకింగ్ విధానానికి కూడా హైకోర్టు అనుమతినిచ్చింది. ధరణి ద్వారా కాకుండా పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లకు అనుమతినిచ్చింది. రిజిస్ట్రేషన్లను ఆపాలని తాము ఎప్పుడూ స్టే ఇవ్వలేదని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. కాగా ధరణిపై తదుపరి విచారణను ఈనెల 16వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.