రేపటి నుంచి తెలంగాణాలో స్కూళ్ల ప్రారంభం, ప్రత్యక్ష బోధన అంశాలపై రాష్ట్ర హైకోర్టు కీలక ఉత్తర్వునిచ్చింది. స్కూళ్లలో ప్రత్యక్ష బోధనకు సంబంధించి విద్యార్థులను బలవంతం చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

క్లాసులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని, ప్రత్యక్షంగా క్లాసులు నిర్వహించని విద్యా సంస్థలపై కూడా చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించింది. ఆన్ లైన్, ప్రత్యక్ష బోధన అంశాలపై స్కూళ్ల నిర్వాహకులే నిర్ణయం తీసుకోవచ్చని కూడా స్పష్టం చేసింది.

స్కూళ్ల ప్రారంభానికి సంబంధించి ప్రయివేట్ టీచర్ బాలకృష్ణ దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు మంగళవారం విచారణ జరిపి ఈ ఆదేశాలను జారీ చేసింది. నాలుగు వారాల్లోపు నివేదిక సమర్పించాల్సిందిగా సర్కార్ ను కోర్టు ఆదేశించింది.

Comments are closed.

Exit mobile version