మంత్రి కేటీఆర్ కు సినిమా హీరోయిన్ కేథరిన్ అడ్వాన్స్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈనెల 24న కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని హీరోయిన్ కేథరిన్ ఆకాంక్షించారు.
ఇదే సందర్భంగా మంత్రి కేటీఆర్ కు నాలుగు రోజుల ముందుగానే ట్విట్టర్ ద్వారా కేథరిన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘సరైనోడు, ఇద్దరమ్మాయిలతో…’ వంటి పలు తెలుగు చిత్రాల్లో కేథరిన్ నటించిన సంగతి తెలిసిందే.