హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా రోడ్లు నదులయ్యాయి. కాలనీలు చెరువులయ్యాయి.
విజయవాడ, బెంగుళూరు హైవేలు దెబ్బతినడంతో మూసివేశారు.
ముసరాంబాగ్ బ్రిడ్జి కొట్టుకుపోయింది.
ఉప్పల్ – ఎల్.బి.నగర్ రోడ్డును, దిల్ సుఖ్ నగర్- కోఠి రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు.
బేగంపేట, గ్రీన్ లాండ్స్, పంజాగుట్ట, మెహదీపట్నం, టోలీచౌకీ వద్ద వరద తీవ్రత ఎక్కువగా ఉన్నది.
కొన్నిప్రాంతాలు నీట మునిగాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
నిజాంపేట్ – బండారీ లేఔట్ ప్రాంతాలన్నీ నీట మునిగాయి.
మెహిదీపట్నం – హైటెక్ సిటీ మార్గంలో రాకపోకలు బంద్ అయ్యాయి.
కూకట్ పల్లి ఐడీపీఎల్ చెరువు, హఫీజ్ పేట్ చెరువు పొంగుతున్నాయి.
మూసీ, హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తివేశారు.
అశోక్ నగర్, హిమాయత్ నగర్, ముషీరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించారు.
నెహ్రూ జూ పార్కు, కేబీఆర్ పార్కులు నీళ్లతో నిండిపోయాయి.
గచ్చిబౌలి – సెంట్రల్ యూనివర్సిటీ రోడ్డు మునిగిపోయింది.
మూసాపేట స్టేషన్లో మెట్రో పిల్లర్ చుట్టూ రోడ్డు కుంగి గొయ్యి పడింది.
ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు రక్షణ చర్యలు తీసుకున్నారు.