జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడుతున్నాయి. పీపుల్స్ పల్స్, ఆరా వంటి సంస్థలతోపాటు ఊరూ, పేరూ లేకుండానూ ‘ఎగ్జిట్ పోల్స్’ పేరుతో అనేక డాక్యుమెంట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని డివిజన్లు గెలుస్తుందనే అంశంపై ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలు పరస్పర భిన్నంగా ఉన్నాయి. ఇందులో ఏవి నిజమవుతాయనే అంశం శుక్రవారం తేలుతుంది. అప్పటి వరకు ఈ భిన్న నివేదికల్లో మీకు ఏది నచ్చితే దాన్నే చదువుకోవచ్చు.