ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుత 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలుగా పునర్విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
ఇందుకు సంబంధించి సలహాలను, సూచనలను, అభ్యంతరాలను 30 రోజుల్లోగా తెలపాలని కోరింది. ఏపీలో విడుదల చేసిన గెజిట్ ప్రకారం కొత్త జిల్లాల పేర్లు, వాటి కేంద్రాలు ఇవే…
శ్రీకాకుళం, పార్వతీపురం కేంద్రంగా మన్యం, విజయనగరం, పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం కేంద్రంగా కోనసీమ, రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పుగోదావరి, భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి, ఏలూరు, మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా, విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్, గుంటూరు, నరసరావుపేట కేంద్రంగా పల్నాడు, బాపట్ల, ఒంగోలు కేంద్రంగా ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి, కడప, రాయచోటి కేంద్రంగా అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి కేంద్రంగా శ్రీ బాలాజీ పేర్లతో కొత్త జిల్లాల ఏర్పాటుకు గెజిట్ విడుదల చేశారు.