టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ప్రత్యేకంగా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు గాయత్రి రవి కూడా మంత్రి కేటీఆర్ ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి మరిన్ని పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని గాయత్రి రవి ఆకాంక్షించారు. మంత్రి కేటీఆర్ ను కలిసిన వారిలో ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఉన్నారు.