కరోనా వైరస్ మహమ్మారి, వ్యాక్సిన్ అంశాలే ప్రామాణికంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్ట్ ఇది. కాసేపు నవ్వించే ఈ ‘టోల్ ఫ్రీ’ కాల్ కథనాన్ని సరదాగా చదివేయండి మరి.
కరోనా వ్యాక్సిన్ వచ్చే వారం నుండి భారతీయలకు అందుబాటులో ఉంటుందని విని నాపేరు నమోదు చేసుకోడానికి టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసాను.
నేను: హలో
ఆవైపు నుండి: కాల్ చేసినందుకు కృతజ్ఞతలు. ఇంగ్లీషుకు 1 నొక్కండి. హిందీకి 2, తెలుగుకు 3 నొక్కండి.
నేను: 3 నొక్కా.
రష్యా వ్యాక్సినుకు 1 నొక్కండి, అమెరికా వ్యాక్సినుకు 2 నొక్కండి, ఇండియన్ వ్యాక్సినుకు 7 నొక్కండి.
నేను: మోడీ ఫ్యాన్ కదా పైగా ఆత్మనిర్బర్ కాన్సెప్ట్ ఫాలో అవుతాను అందుకే 7 నొక్కా.
మీరు పురుషులైతే 1 నొక్కండి, స్త్రీ అయితే 2 నొక్కండి, ట్రాన్స్ జెండర్ అయితే 6 నొక్కండి.
నేను: 1 నొక్కా
వ్యాక్సిన్ కొనడానికి 1 నొక్కండి, ఉచితంగా వేయించుకోడానికి 2 నొక్కండి.
నేను: మనది ఫ్రీ బ్యాచే కదా కాబట్టి 2 నొక్కా!
చేతిమీద వ్యాక్సిన్ పొడిపించుకోడానికి 1 నొక్కండి, తుంటిమీద వేయించుకోడానికి 2 నొక్కండి. ఇంకేదైనా ప్రదేశంలో వేయించుకోడానికి 5 నొక్కండి.
నేను:ఇంకేదైనా అంటే, మరెక్కడ వేస్తారు? ఆలోచనలో పడ్డా.
మీ నుండి ఎటువంటి సమాధానం రాలేదు. చేతిమీద వ్యాక్సిన్ పొడిపించుకోడానికి 1 నొక్కండి, తుంటిమీద వేయించుకోడానికి 2 నొక్కండి. ఇంకేదైనా ప్రదేశంలో వేయించుకోడానికి 5 నొక్కండి.
నేను:వామ్మో రిస్క్ ఎందుకులే అని 1 నొక్కా!
మీ మొబైల్ నెంబరు నొక్కండి.
నేను:హమ్మయ్య దాదాపుగా వ్యాక్సిన్ అందినట్టే అనుకుని మొబైల్ నెంబరు నొక్కా!
ధన్యవాదములు. మీ నెంబరు ఉచిత వ్యాక్సిన్ పొందడం కోసం రిజిస్టర్ చేయబడినది. మా డేటాబేస్ నందు మీ వివరాలు పొందుపరచబడ్డాయి. ఉచిత వ్యాక్సిన్ చేయించుకోడానికి మీ ఆధీకృత సీరియల్ నెంబరు #83కోట్ల 56 లక్షల 98వేల 438. సామాన్య పరిస్థితుల్లో మీకు ఫిబ్రవరి 2024 నాటికి వ్యాక్సిన్ అందే అవకాశమున్నది. 2024 లో మా నుండి మీకు కాల్ వచ్చే అవకాశముంది. అంతవరకు శానిటైజర్ వాడుతూ, సామాజిక దూరం పాటిస్తూ కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని తెలియచేస్తున్నాం.
కాల్ చేసినందుకు ధన్యవాదాలు..????
(పేరు రాసుకోని రచయితకు కృతజ్ఞతలతో…)