ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య నాలుగుకు పెరిగింది. కర్నాటకలో ఇప్పటికే రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులను గుర్తించగా, శనివారం గుజరాత్, మహారాష్ట్రల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైంది. దీంతో దేశ వ్యాప్తంగా ఒమిక్రాస్ వేరియంట్ సోకిన బాధితుల సంఖ్య నాలుగుకు చేరింది.
దక్షిణాఫ్రికా నుంచి ముంబయికి చేరిన 33 ఏళ్ల వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్లు గుర్తించారు. గత నెల 24వ తేదీన ఇతను దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్, ఢిల్లీ మీదుగా ముంబయికి చేరుకున్నట్లు కనుగొన్నారు.
కాగా తాజా ఒమిక్రాన్ బాధితుని ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు వ్యక్తులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 35 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, వారందరీకి నెగిటివ్ రిజల్డ్ రావడం గమనార్హం.