‘’కలిసొచ్చో, అర్ధంతరంగానో, అదృష్టవశాత్తో రాజకీయాల్లోకి రావచ్చు… పదవులు రావచ్చు. కానీ, ఆ పదవులను దుర్వినియోగం చేసే ఆలోచన మీకు ఉండకూడదు. ఆ దురదృష్టం మీకు పట్టకూడదు. అది ఖమ్మం జిల్లా ప్రజలకు నష్టం చేస్తుంది. కొంత మంది అంతర్గతంగా చేసినటువంటి దుశ్చర్య వల్ల నష్టం జరిగింది కాబట్టి నేను మౌనంగా ఉన్నాను. అంతే తప్ప… రాజకీయాలు చేయలేకనో, తెలియకనో కాదు. ఇటువంటి నీచ, నికృష్ణ పనులకు పాల్పడవద్దని, ప్రోత్సహించవద్దని, అది మీ భవిష్యత్తుకు మంచిది కాదని హెచ్చరిస్తున్నాను’’. ఇవీ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం చేసిన వ్యాఖ్యలు.
ఇప్పుడీ వ్యాఖ్యలు ఖమ్మం జిల్లా అధికార పార్టీ రాజకీయాల్లో కలకలం కలిగిస్తున్నాయి. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ, ఐదుగురు వ్యక్తులపై తుమ్మల నాగేశ్వరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కు స్వయంగా తానే వచ్చి, టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులపై ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఇంకా ఈ అంశంపై తుమ్మల ఏమన్నారో దిగువన గల వీడియోలో వీక్షించండి.