నిజమే… మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ వెళ్లారు. ఈరోజు ఉదయాన్నే ఆయన సత్తుపల్లి సమీపంలోని గండుగులపల్లిలో గల తన నివాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి మరీ రాజధానికి పయనమైనట్లు సమాచారం. తుమ్మల రాజధాని పర్యటనపై ఏవేని రాజకీయ విశేషాలు ఉంటాయా? లేదా? అనే అంశం అధికార పార్టీ శ్రేణుల్లో ఆసక్తికరంగా మారింది. ఈసారి హైదరాబాద్ పర్యటనలో తమ నాయకుడు ఖచ్చితంగా సీఎం కేసీఆర్ ను కలుస్తారని తుమ్మల అనుచరగణం బలంగా విశ్వసిస్తోంది. తుమ్మల రాజకీయ భవితపై ఆయన అనుచరగణం అంచనాలపై ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే మరి.