మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామిని కలిసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. మై హోం అధినేత జూపల్లి రామేశ్వర్ రావు, ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో కలిసి తుమ్మల నాగేశ్వర్ రావు జీయర్ స్వామితో భేటీ కావడంపై పార్టీ వర్గాలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ వర్గాలు ఈ అంశంపై భిన్న రకాల చర్చకు దిగడం విశేషం.