తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లో తాను నీతి, నిబద్ధతకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, పార్టీ మారే ఉద్ధేశం కూడా తనకు లేదన్నారు.
తాను టీఆర్ఎస్ లో చేరినపుడే ఓ స్పష్టతతో చేరానని, ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే తన పయనమని తుమ్మల నాగేశ్వర్ రావు పునరుద్ఘాటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి తాను పాటుపడ్డానని గుర్తు చేశారు.