కుమారుడు స్కేట్ బోర్డుపై ముందుకు సాగుతుండగా, తండ్రి సైక్లింగ్ చేస్తూ హైదరాబాద్ వీధుల్లో విహరిస్తున్న వీడియో దృశ్యమిది. తెలంగాణా రాజధాని కేంద్రంలో కరోనా కోరలు చాస్తున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి ఏకైక పుత్రుడు, మాజీ మంత్రి నారా లోకేష్, ఆయన మనవడు ఇలా విహరిస్తూ వీడియోలో చిక్కారు. చంద్రబాబు మనవడంటే లోకం తెలియని చిన్నారి. కానీ కేబినెట్ మంత్రిగా పనిచేసిన లోకేష్ కరోనా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి, అదీ మాస్కు కూడా లేకుండా సైక్లింగ్ చేస్తూ ఇలా జూబ్లీ హిల్స్ వీధుల్లో వీరవిహారం చేయడమేంటనే విమర్శలు వచ్చాయి. లోకేష్ ఆయన తనయుడి ‘విన్యాసాలు’ రోడ్డుపై సాగుతున్న సమయంలో గన్ మెన్లు మాస్కులు ధరించి వారిని అనుసరించడం గమనార్హం. ఆ వీడియోను దిగువన చూడండి.