గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు తరుముకొస్తున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఇది భారీ షాక్. హైదరాబాద్ మాజీ మేయర్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య మహిళా నేత బండ కార్తీకరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే గురువారం ఆమె బీజేపీలో చేరనున్నట్లు ఆయా వార్తల సారాంశం. బీజేపీ నేతలతో ఈమేరకు ఇప్పటికే సంప్రదింపులు పూర్తయినట్లు తెలుస్తోంది. రాజకీయ భవితపై బండ కార్తీకరెడ్డికి బీజేపీ నేతలు గట్టి భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.