కరోనా సోకి భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి చెందారు. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో రాజయ్యకు నిన్న కరోనా టెస్టులు నిర్వహించగా, పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. చికిత్స కోసం ఆయనను విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచారు. భద్రాచలం నుంచి మూడుసార్లు రాజయ్య ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. సున్నం రాజయ్య మృతి పట్ల సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.