తెలంగాణాలో బుధవారం నుంచి అమలు చేస్తున్న లాక్ డౌన్ కఠినంగా అమలవుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. బుధవారం లాక్ డౌన్ అమలైన తీరు ఇలా ఉంది.
- ఉదయం 6 నుంచి 10 వరకు తెరుచుకున్న అన్ని షాపులు
- రోజువారీ నిత్యావసరాలు, ఇతర కొనుగోళ్లతో రద్దీ
- ఆ 4 గంటలపాటే సేవలందించిన మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులు
- ఆ తర్వాత 20 గంటలపాటు కట్టుదిట్టంగా లాక్ డౌన్
- యథావిధిగా వ్యవసాయ పనులు, ధాన్యం కొనుగోళ్లు
- ప్రత్యేక పాసులతో విధులకు హాజరైన వైద్య సిబ్బంది
- 33% సిబ్బందితో పనిచేసిన ప్రభుత్వ కార్యాలయాలు
- గ్రామీణ ప్రాంతాల్లో యధావిధిగా ఉపాధి హామీ పనులు
- తెరిచే ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లు, పెట్రోల్ బంకులు
- వివిధ రంగాల వర్క్ ఫ్రమ్ హోం విధుల్లో వీలైన ఉద్యోగులు
- ప్రభుత్వ, ప్రైవేట్ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు పూర్తిగా రద్దు
- ప్రజలు లాక్డౌన్ పూర్తయ్యే వరకు సరిహద్దు దాటేందుకు నో ఛాన్స్
- లాక్ డౌన్ తో మూసే ఉన్న అన్ని ఆలయాలు, ప్రార్థనా మందిరాలు
- బంద్ అయిన థియేటర్లు, పార్కులు, క్లబ్లు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్స్
- ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు, కఠినంగా లాక్ డౌన్ నిబంధనల అమలు