ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాన ప్రతిభ గురించి పుంఖాను పుంఖాలుగా మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరమే లేదు. వేలాది పాటలను అలవోకగా ఆలపించిన ఆయన గాత్ర మాధుర్యం అందరికీ తెలిసిందే. స్టూడియోల్లో పాటలు పాడడం వేరు కావచ్చు. కానీ వేదికలపై కూడా గుక్క తిప్పకోకుండా పాడిన పాటలను మళ్లీ ఆలపించడం బాలుకే చెల్లుతుందని అంటుంటారు.
ఎంత పొడవాటి చరణమైనా సరే శ్వాసను బ్యాలెన్స్ చేస్తూ పాడడంలో బాలుకు గల ప్రత్యేకతను ఎవరూ అధిగమించలేరని సంగీతాభిమానులు చెబుతుంటారు. ‘అంతులేని కథ’ చిత్రంలో తాళికట్లు శుభవేళ… అంటూ సాగే పాటలో మ్యూజిక్ తోపాటు పక్షుల అరుపులు కూడా వినిపిస్తుంటాయి. ఆయా పక్షుల అరుపులను తన గొంతుతోనే పాట సహా ఆలపించడం ‘బాలు మేజిక్’లోని ప్రత్యేకత.
ఈ దిగువన గల ఆయా పాట చాలు బాలు గాత్ర మేజిక్ ఏమిటో చెప్పడానికి. మీరూ విని ఆస్వాదించండి.