గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎక్సజ్ ఎస్ఐగా పనిచేస్తున్న గీత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి ఆమె చేసిన యత్నం గుంటూరు ఎక్సైజ్ అధికార వర్గాల్లో కలకలానికి కారణమైంది.
ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్ వేధింపుల వల్లే గీత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ సూపరింటెంటెండ్ బాలకృష్ణన్ పై ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేసి, విచారణకు ఆదేశించారు.
ఫొటో: ఎక్సైజ్ ఎస్ఐ గీత