హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కుతోంది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం బీజేపీలో చేరిన నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీలో చేరిన తర్వాత ఈటెల రాజేందర్ తొలిసారి హుజూరాబాద్ పర్యటనకు బయలుదేరారు. వరుసగా నాలుగు రోజులపాటు ఈటెల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంలోనే మకాం వేయనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగారాజేందర్ భార్య ఈటెల జమున కూడా గురువారం హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కమలాపూర్ మండలం అంబాల గ్రామానికి వచ్చిన జమునకు స్థానిక బీజేపీ కార్యకర్తలు, ఈటెల రాజేందర్ అనుయాయులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. మండలంలోని ఇంకా అనేక గ్రామాల్లో జమున స్థానిక ప్రజలను, కార్యకర్తలను కలుసుకోనున్నారు.
ఫొటో: అంబాలలో జమునకు స్వాగతం పలుకుతున్న ప్రజలు