మూడు కమిషన్లను ఏర్పాటు చేస్తూ, వాటికి చైర్మెన్లను నియమిస్తూ తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఈ కమిషన్లకు చైర్మెన్లను, సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది.
ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని ప్రభుత్వం నియమించింది. రెండేళ్లపాటు ఈయన ఈ పదవిలో ఉంటారు. అదేవిధంగా బీసీ కమిషన్ చైర్మెన్ గా నిరంజన్ ను, సభ్యులుగా రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ ను నియమించింది.
ఇక కీలకమైన వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ కు చైర్మెన్ గా ఎం. కోదండరెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ పదవిలో కోదందరెడ్డి రెండేళ్లపాటు ఉంటారు. కాగా బీసీ కమిషన్ ఇప్పటికే ఉండగా, విద్య, వ్యవసాయ కమిషన్లను ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది.