తెలంగాణాలోని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో శనివారం రాత్రి పొద్దుపోయాక జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు నక్సలైట్లు మరణించారు. నక్సలైట్ల గాలింపు చర్యలు నిర్వహిస్తున్న సమయంలో కాగజ్ నగర్ మండలం కడంబా అడవుల్లోని గుట్ట వద్ద మావోయిస్టులు తారసపడినట్లు పోలీసులు చెప్పారు.
ఈ సందర్భంగా తారసపడిన మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులు జరపగా, ప్రతిగా పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు మృతి చెందినట్లు జిల్లా ఇంచార్జ్ ఎస్పీ సత్యనారాయణ ప్రకటించారు. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ మంచిర్యాల, కుమ్రం భీం జిల్లాల డివిజనల్ కమిటీ కార్యదర్శి మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ తృటిలో తప్పించుకున్నట్లు పోలీసులు చెప్పారు.