తెలంగాణాలో భారీ ఎన్కౌంటర్ ఘటన చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం అడవుల్లో ఈ ఉదయం జరిగినట్లు సమాచారం అందుతున్న ఘటనలో ఆరుగురు మావోయిస్టు పార్టీ నక్సలైట్లు మరణించారు. రఘునాథపాలెం అడవుల్లో మావోయిస్టులకు, పోలీసులకు జరిగిన భీకరపోరులో ఆరుగురు నక్సల్స్ మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. మరణించిన నక్సల్స్ లో పార్టీకి చెందిన ఓ అగ్రనేత ఉన్నట్లు కూడా వార్తలు అందుతున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.