మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని గడ్చిరోలి జిల్లా అడవుల్లో కొద్దిసేపటి క్రితం జరిగిన భారీ ఎన్కౌంటర్ ఘటనలో ఐదుగురు మావోయిస్టు నక్సలైట్లు మరణించారు. ధనోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని కొసమి-కిసనెలి అడవుల్లో మావోయిస్టు పార్టీ నక్సలైట్లకు, సీ-60 కమాండో భద్రతా బలగాలకు భీకర ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ సంఘటనలో ఐదుగురు మావోయిస్టు నక్సలైట్లు మరణించినట్లు గుర్తించగా, వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు.