పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి ప్రజలను అతలాకుతలాం చేస్తోంది. నిన్న సాయంత్రం నుంచి వందలాదిగా మనుషులు ఎక్కడికక్కడే కుప్పకూలుతున్నారు. వాంతులు, మూర్చ లక్షణాలతో ఉన్నఫళంగా పడిపోతున్న బాధితుల సంఖ్య ఇప్పటికే 200 దాటింది. దాదాపు 227 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో 76 మంది మహిళలు, 46 మంది పిల్లలు కూడా ఉన్నారు.

కొందరి పరిస్థితి విషమంగా మారడంతో వారిని మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. బాధితుల్లో దాదాపు 150 మంది వరకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తాగే నీళ్లు కలుషితం కాలేదని, రక్త పరీక్షల్లోనూ వ్యాధి నిర్ధారణ కావడం లేదని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. మొత్తంగా ఏలూరు పట్టణ ప్రజలు ఇప్పుడు ఇటువంటి దృశ్యాలతో ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కుంటున్నారు. పదే పదే అవే లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య ఎప్పటికప్పుడు మారుతోంది.

ఫొటో: ఏలూరు ఆసుపత్రిలో బాధితులను పరామర్శిస్తున్న మంత్రి ఆళ్ల నాని

Comments are closed.

Exit mobile version