Facebook Twitter YouTube
    Sunday, June 4
    Facebook Twitter YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»అమ్మ… ఈనాడూ…? నువ్వూ కాపీ ‘మాస్టర్’వేనన్నమాట!

    అమ్మ… ఈనాడూ…? నువ్వూ కాపీ ‘మాస్టర్’వేనన్నమాట!

    April 12, 20203 Mins Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 ENADU

    ‘కురులు ఉన్నమ్మ కొప్పు ఎలా ముడిచినా ఫరవాలేదంటారు.’ తెలుగు రాష్ట్రాల్లో ఇదో నానుడి కూడా. అత్యధిక సర్క్యులేషన్ గల తెలుగు దినపత్రిక ‘కథ’ను కాపీ కొట్టినా, కట్ అండ్ పేస్ట్ చేసినా, కాస్త అటూ, ఇటూ మార్చినా, భాషా దోషాలు సవరిస్తూ ‘లిఫ్ట్’ చేసినా రీడబిలిటీ ఉంటుందన్నది తాజా ఒరవడి. సోషల్ మీడియాలో వచ్చే అంశాలను ‘ఫేక్’ అంటూ అదేపనిగా ప్రచారం చేస్తున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా కాపీ నిర్వాకానికి నిలువెత్తు నిదర్శనమిది. కరోనా లాక్ డౌన్ పరిణామాల్లో దిగువన గల ఓ ‘జింకల వనం’ కథ గడచిన వారం రోజులుగా సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సప్ గ్రూపుల్లో తెగ చక్కర్లు కొడుతోంది. తాజా పరిస్థితికి తగినట్లు కథనం ఉండడంతో ఈ పోస్ట్ భారీగా షేర్ అవుతోంది కూడా. ఇదే కథను అత్యధిక సర్క్యులేషన్ ట్యాగ్ లైన్ గల ఈనాడు పత్రిక ‘లిఫ్ట్’ చేసి ప్రచురించడమే అసలు విశేషం. ఒరిజినల్ సోషల్ మీడియా పోస్టుకు చిన్ను, తాతయ్య అనే రెండు సంభాషణ పాత్రలను సృష్టించి, వాక్య నిర్మాణాలను సవరించి, కార్టూనిస్టుతో అడవి, సింహం, జింక బొమ్మలు గీసి, పంచరంగుల్లో ఈ కథను ఈనాడు తన వసుంధర పేజీలో హాయ్ బుజ్జీ శీర్షికన ప్రచురించడం గమనార్హం. సోషల్ మీడియా పోస్టులకు విశ్వసనీయత లేదని నేటి సండే మేగజైన్ లోనూ కవర్ స్టోరీ ప్రచురించిన ఈనాడు సోషల్ మీడియా కథను మాత్రం ఎలా విశ్వాసంలోకి తీసుకుని ప్రచురించిందన్నదే అసలు సందేహంగా సోషల్ మీడియా యాక్టివిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘ఈనాడు’ ప్రచురించిన వార్తా కథనాన్ని, సోషల్ మీడియా పోస్టును దిగువన పరిశీలించవచ్చు.

    ts29 eenadu deer
    ‘ఈనాడు’ ప్రచురించిన వార్తా కథనపు క్లిప్పింగ్

    ఇదీ సోషల్ మీడియా ఒరిజినల్ పోస్ట్: (ఉన్నది ఉన్నట్లు)

    *శత్రువు ఎంత బలవంతుడైనా యుద్ధం లో ఎలా గెలవాలి అంటే తెలివితోనే గెలవాలి*

    ( *ప్రస్తుత పరిస్థితి కి అద్దం పట్టే కథ… తప్పక చదవండి.*)

    అది ఒక అందమైన జింకల వనం. అందులో జింక జాతులు ఆనందంగా, నిర్భయంగా జీవిస్తున్నాయి.

    ఒకసారి ఆ వనం నుంచి ఒక జింక దారి తప్పి, వేరే అడవిలోకి వెళ్ళింది. అక్కడ దానికి ఎన్నెన్నో కొత్త కొత్త జంతువులు కనిపించాయి. తోడేళ్ళనూ, పులులనూ, సింహాలనూ, నక్కలనూ తొలిసారి అక్కడే చూసింది.

    అక్కడ ఒక కొమ్ముల జింక ఎదురై- ‘‘ఓ జింక సోదరా! ఈ అడవిలో నిన్నెప్పుడూ చూడలేదే!’’ అంది.

    ‘‘అవును. మాది జింకల వనం!’’

    ‘‘ఈ అడవి మీ జింకల వనం లాంటిది కాదు. ఇక్కడ మనల్ని చంపి తినే క్రూరమృగాలు ఉన్నాయి. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో మీకసలు తెలియదు. కాబట్టి ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో!’’ అంటూ ఆ జింక గెంతుతూ వెళ్ళిపోయింది.

    ‘‘పిరికి జింక! నేనూ జింకనే. అదెలా తప్పించుకోగలదో నేనూ అలాగే తప్పించుకోగలను’’ అనుకుంటూ జింకలవనం జింక ముందుకు వెళ్ళింది.

    అక్కడ చెట్టు కింద నిద్రపోతున్న సింహం కనిపించింది. జింక మెల్లగా దాని దగ్గరకు వెళ్ళి, తన ముంగాలి గిట్టతో సింహం తోకను తొక్కింది.

    సింహానికి మెలకువ వచ్చింది. బద్దకంగా లేస్తూ జింకను చూసింది. గర్జించింది. ఆ గర్జన విని, జింకకు గుండె ఆగినంత పని అయింది.. వెను తిరిగి వచ్చిన దారినే పరుగులు పెట్టింది. అడవి దాటి జింకలవనం వైపు పరుగులు తీస్తూనే ఉంది. జింకలవనం సమీపానికి రాగానే సింహానికి చిక్కింది. సింహం దాన్ని చంపి, చీల్చి ఆరగించింది.

    తరువాత సింహం లేచి మెల్లగా జింకలవనంలోకి వెళ్ళింది. దానికి అది కొత్త ప్రదేశం. అక్కడ దానికి గుంపులు గుంపులుగా జింకలు కనిపించాయి. సింహం ఆనందానికి అంతు లేదు. దొరికిన జింకను దొరికినట్టు చంపి తినేస్తోంది.

    కొత్తగా ముంచుకొచ్చిన ఈ మృత్యువును చూసి జింకలన్నీ భయపడిపోయాయి. చెల్లాచెదురయ్యాయి. పొదల్లో దాక్కున్నాయి. బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాయి. పొరపాటున ఏ జింకయినా బయటకొస్తే చాలు… సింహం దాన్ని పడగొట్టేస్తోంది.

    అయితే ఆ జింకల్లో తెలివైన కుర్ర జింక ఒకటుంది. దాని పేరు జ్ఞాననేత్ర. జింకల పెద్దలు జ్ఞాననేత్ర దగ్గరకు వచ్చి- ‘‘దీనికి పరిష్కారం ఏమిటి?’’ అని అడిగాయి.

    ‘‘జింక పెద్దలారా! నేనూ అదే ఆలోచిస్తున్నాను. ఈ క్రూరజంతువును ‘సింహం’ అంటారు. దీని పంజా నుంచి తప్పుకొనే చాకచక్యం మనకు లేదు. ఎటు ఆలోచించినా, ఎంత యోచించినా ఒకే ఒక్క దారి కనిపిస్తోంది. ఈ సింహం ఆహారం లేకుండా 14 రోజులు మాత్రమే బతకగలదు. కానీ మనం 21 రోజులు బతకగలం. కాబట్టి మన జింకలన్నీ తమ పొదల్లోకి దూరి 14 రోజులు బయటకు రాకుండా ఉంచే చాలు. దీని పీడ మనకు విరగడ అవుతుంది. మనలో ఎవరైనా నిర్లక్ష్యంతో బయటకు వచ్చి దానికి చిక్కారా… దాని జీవిత కాలాన్ని మరో 14 రోజులు పెంచినట్టే! ఈ రోజు అమావాస్య. ఇప్పుడే పొదల్లోకి చేరిపోదాం. పున్నమి నాటికి బయటకు వద్దాం. తమ పొద నుంచీ ఏ జింకా బయటకు రాకుండా చూసే బాధ్యత ఆ జింకల పెద్దలదే!’’ అంది.

    జింకలన్నీ జ్ఞాననేత్ర మాటలు విన్నాయి. ఆకలితో అలమటించాయి.

    పున్నమి వచ్చింది. జింకలన్నీ ఒక్కొక్కటీ భయం భయంగా బయటకు వచ్చాయి. వనం మధ్య చెట్టుకింద చచ్చి పడి ఉన్న సింహాన్ని చూశాయి. ఆనందంతో అరిచాయి. గెంతాయి. జింకల కేరింతలతో వనమంతా పులకరించింది.

    *ప్రస్తుతం జరుగుతున్న కరోనా పై యుద్ధంలో తెలివి వున్నవాళ్లు ఇంట్లోనేవుండి విజయం సాధిస్తారు, తెలివి లేనివాళ్లు మాత్రమే బయట తిరిగి బలి అవుతున్నారు*
    *StayHome*
    *StaySafe*
    ???????????

    Previous Articleకేసీఆర్ పరోక్ష ‘వార్నింగ్’… ఆర్కే ప్రత్యక్ష ‘అడ్మిట్’!
    Next Article ‘అనుభవించు’ రాజా! ఇందుకు మీరే బాధ్యులు… జర్నలిస్టులు కాదు!!

    Related Posts

    దొడ్డ మనసులో వద్ది‘రాజు’

    May 12, 2023

    ఖమ్మంలో బీజేపీ నేతల అరెస్ట్

    May 5, 2023

    పొంగులేటి ఇంట్లో పొలిటికల్ స్కెచ్ ఏంటి?

    May 4, 2023

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook Twitter YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.