వచ్చే వారంలో తెలంగాణాలో ఇంటర్ ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ విషయాన్ని చెప్పారు. సోమవారం ఆమె మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ, వివిధ సెట్స్ పరీక్షా తేదీలను కూడా ఇప్పటికే ఖరారు చేశామన్నారు. డిగ్రీ, పీజీ తరగతులు వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. కాగా పీజుల విషయంలో గతంలో ఇచ్చిన 46 జీవోను అమలు చేస్తామని ఆమె అన్యాపదేశంగా చెప్పారు. ఫీజుల విషయంలో ప్రయివేట్ విద్యా సంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డిగ్రీ, పీజీ విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తామన్నారు. ఫీజుల తగ్గింపునకు సంబంధించి స్కూళ్ల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ముందుగా వ్యాక్సిన్ వేస్తామని, టీచర్లకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎస్ ను కోరినట్లు చెప్పారు. కాగా జూన్ 25వ తేదీ నుంచి టీచర్లు పాఠశాలలకు హాజరు కావాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.