బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి పిలుపొచ్చింది. జనవరి 7వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ కోరింది. ఫార్ములా ఈ-రేసు కేసులో కేటీఆర్ తోపాటు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ కు, హెచ్ఎండీఏ మాజీ సీఈ బీఎల్ఎన్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది.
అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను జనవరి 2, 3వ తేదీల్లో, కేటీఆర్ ను 7వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ తన నోటీసుల్లో పేర్కొంది. ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీపీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈ విచారణ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే కేటీఆర్ తోపాటు అర్విద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను విచారణకు రావాలని కోరింది.