ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటానని దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత అన్నారు. తనపై ఎంతో నమ్మకాన్ని ఉంచి దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థిగా నిర్ణయించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆమె స్పష్టం చేశారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్యగా ఆయన ఆశయాలను, ప్రజాసేవను కొనసాగిస్తానని సుజాత అన్నారు. మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తదితరుల సహకారంతో దుబ్బాక ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. తద్వారా ప్రజలకు సేవ చేసుకుంటానని, ప్రజలు ఆశీర్వదించి తనను గెలిపించాలని సుజాత అభ్యర్థించారు.