దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు వివిధ పార్టీలపై ఎంతో ప్రభావం చూపిస్తాయి అనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ కంచుకోటగా భావించే దుబ్బాకలో సీనియర్ నాయకుడు చెరుకు ముత్యంరెడ్డిని 2004లో టీఆర్ఎస్ అభ్యర్థి రాంలింగారెడ్డి ఓడించి గులాబీ పతాకాన్ని ఎగురవేశాడు. అప్పటి నుంచి 2009 ఎన్నికల్లో తప్ప అన్ని ఎన్నికల్లొ టీఆర్ఎస్ విజయం సాధించడంతో ఆ పార్టీకి కంచుకోటగా మారింది. ఆయన మరణాంతరం జరిగిన ఈ ఎన్నిక అన్ని ప్రధాన పార్టీలకు తమ తమ బలాబలాలను ప్రదర్శించేందుకు వేదికగా మారింది.
ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునంధన్ రావు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతను ఓడించి కాషాయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ ఫలితాలను ఒక పార్టీలో ప్రక్షాళనకు అవకాశంగా తీసుకోవచ్చు, మరో పార్టీ పునరుజ్జీవానికి నాందీ పలకవచ్చు.
ఈ ఫలితాలను పార్టీలు ఆషామాషీగా తీసుకుంటే బొక్కబోర్లా పడడం ఖాయం. కొంతమంది ప్రధాన నాయకులు బీజేపీ వైపు తొంగి చూసే అవకాశాలున్నాయి. అధికార పార్టీలో అవసరమైన మార్పులు చేసే అవకాశముంటుంది. పార్టీ వ్యవహరించాల్సిన తీరులో మార్పు కనిపించే అవకాశముంటుంది. ఒకటే సీటు కదా… బీజేపీ గెలిచింది అని టీఆర్ఎస్ అనుకుని ఇలాగే వ్యవహరిస్తే, వ్యుహాలు మార్చకుంటే, ప్రక్షాళన చేయకుండా మాకేంటి అని విర్రవీగితె టీఆర్ఎస్ పతనం ఈ ఫలితాలతోనే మొదలవుతుంది.
అలాగే… బీజేపీ పరిస్థితి. బీజేపీ ఈ విజయంతో ఆగిపోకుండా ఈ ఎన్నికల్లో వ్యవహరించిన తీరుకన్నా ఇంకా మెరుగైన రీతిలో పార్టీ శ్రేణులను తీర్చి దిద్ది, మిగతా నియోజకవర్గాల్లో సైతం పార్టీకి బలమైన నాయకత్వం ఇచ్చే దిశలో నడవాలి.
మరీ కాంగ్రెస్ పరిస్థితి ఎంటీ.. కాంగ్రెస్ కు గత ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయో ఈ ఎన్నికల్లో అన్ని ఓట్లు వచ్చాయి.. అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. తెలంగాణ ఏర్పాటు అనంతరం
కేవలం నాయకత్వ లేమి వల్లనే కాంగ్రెస్ ఓటమి చవి చూడాల్సి వస్తోంది. రాష్ట్ర నాయకత్వం మార్పు జరిగి.. ఒక బలమైన నాయకుడు పార్టీని ముందుకు నడిపిస్తే.. మళ్లీ పూర్వ వైభవం సాధ్యం.. లేకుంటే ఒక్కో ఎన్నికతో పార్టీ క్షీణిస్తూ చివరకు కమ్యునిస్ట్ పార్టీల మాదిరిగా ఎక్కడో ఒక చోట బలమైన నాయకుడు వ్యక్తిగతంగా తనకున్న బలంతో గెలుస్తారు..
గత ఎన్నికలతో, తాజా ఎన్నికలతో బేరీజు వేసినపుడు పార్టీల పరిస్థితి ఓటింగ్ సరళిని బట్టి అవగతమవుతుంది.
2018లో
మొత్తం ఓట్లు 1,63,401
టీఆర్ఎస్ – సోలిపేట రామలింగా రెడ్డి – 89,299, 54.36 శాతం
2020లో
మొత్తం ఓట్లు 1,98,807
టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు వచ్చిన ఓట్లు 61,302
అంటే 28 వేల మంది ఓటర్లు వ్యతిరేకంగా ఓటు వేశారు.
2018లో కాంగ్రెస్ – మద్దుల నాగేశ్వర రెడ్డి – 26,799,
16.31 శాతం
ఇప్పుడు ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డి 21,819 అంటే దాదాపు 5 వేల ఓట్లు చెజారాయి.
2018లో
బీజేపీ – మాధవనేని రఘునందన రావు – 22,595 ఓట్లు, 13.75 శాతం
2020లో
బీజేపీ అభ్యర్టి మాధవనేని రఘునందనరావు 62,772 ఓట్లు వచ్చాయి. అంటే 40 వేల పైచిలుకు ఓట్లు ఎక్కువగా సాధించారు.
2018లో
టీఆర్ఎస్ మెజార్టీ 62,500 ఓట్లు..
2020లో
బీజేపీ మెజార్టీ 1470 ఓట్లు
✍️ దహాగాం శ్రీనివాస్