ఇండియాలోని మరో కట్టడానికి వారసత్వ సంపదగా ‘యునెస్కో’ గుర్తింపు లభించింది. గుజరాత్ లోని ధోలవిరాను వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించింది. ఈమేరకు వారసత్వ కట్టడాల జాబితాలో ఈ చారిత్రిక కట్టడాన్ని చేరుస్తూ యునెస్కో ట్వీట్ చేసింది. హరప్పా నాగరికతనాటి పట్టణంగా ధోలవిరా ప్రసిద్ధి గాంచింది. కచ్ జిల్లాలో గల ధోలవిరా పట్టణానికి 4,500 ఏళ్లనాటి చారిత్రక ఆధారాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. తెలంగాణాలోని రామప్ప దేవాలయం సరసన ధోలవిరి కూడా వారసత్వ కట్టడంగా చేరడం విశేషం. యునెస్కో గుర్తించిన 40వ వారసత్వ సంపదగా ధోలవిరా కీర్తిని గడించింది.