గ్రామాల్లో, పట్టణాల్లో ఇప్పటికీ ‘ఆన్ లైన్’లో నమోదు కాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్ లైన్ లో నమోదు చేయాలని తెలంగాణా ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈమేరకు అధికారగణం సమాయత్తమైంది. ఈనెల 22న సీఎం కేసీఆర్ ఇందుకు సంబంధించి ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు.
ప్రజల ఆస్తుల నమోదు ప్రక్రియలో భాగంగా తాజా ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఆస్తుల నమోదు సందర్భంగా ప్రజల వద్దకు వచ్చే సిబ్బంది ఏయే వివరాలు అడుగుతారు? ప్రజలు అందించాల్సిన సమాచారం, సహకరించాల్సిన తీరును పేర్కొంటూ ఖమ్మం మున్సిపల్ కమిషనర్ కొద్దిసేపటి క్రితం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక, పురపాలక సంఘాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే వివరాలు అందించాల్సి ఉంటుందంటున్నారు. ఆయా ప్రకటనను దిగువన ఉన్నది ఉన్నట్లుగా చదవవచ్చు.
? ఖమ్మం పట్టణ ప్రజలకు గమనిక?
⭕ ఖమ్మం పట్టణ ప్రజలకు తెలియపరచునది ఏమనగా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , టి.యస్ , హైద్రాబాద్ గారి టెలికాన్ఫరెన్స్ ఆదేశాల మేరకు ఖమ్మం పట్టణములో అర్భన్ ( ధరణి ) పోర్టల్ నందు 48 కాలమ్ నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ వివరములను సేకరించి ధరణి వెబ్ సైట్ నందు నమోదు చేయుటకు. మున్సిపల్ సిబ్బంది మీ మీ వార్డులకు వచ్చి ఈ దిగువ వివరాలు సేకరిస్తారు.
➤ ఇంటి పన్ను రసీదు
➤ కరెంటు బిల్లు రసీదు
➤నీటి పన్ను రసీదు
➤ ఇంటిపేరు గల ఎజమాని ఫోటో
➤ఇంటి ఓనర్ గుర్తింపు కార్డు
రిజిస్ట్రేషన్ పత్రములు లేదా పట్టా పాస్ బుక్ నెంబర్ వివరములు
➤ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్
➤ జనదన్ బ్యాంక్ అకౌంట్
➤ జాబ్ కార్డు వివరములు
➤ ఆసరా పెన్షన్ వివరములు
➤ యజమాని ఆధార్ కార్డ్ మరియు మీ కుటుంబసభ్యుల ఆధార్ కార్డుల వివరములు
➤ ఓనర్ సెల్ ఫోన్ నెంబర్ మరియు మీ కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు
మొదలగు వివరములు.
⭕మీ వార్డులకు వచ్చి సేకరించే మా సిబ్బంది కి పట్టణ ప్రజలు సహకరించగలరని కోరనైనది.
ఇట్లు
కమిషనర్
ఖమ్మం నగరపాలక సంస్థ